Fri Nov 22 2024 16:27:16 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్, హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోదా ఆసుపత్రి వైద్యులు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోదా ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. తన నివాసంలోని బాత్రూమ్ లో కేసీఆర్ జారి పడడంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి ఆయనను తీసుకొచ్చారని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. సీటీ స్కాన్ తో పాటు పలు పరీక్షలను నిర్వహించగా ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామని చెప్పారు. ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
కేసీఆర్ కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ గారు బాత్రూంలో జారిపడ్డారని, ఆయనకు వైద్యులు ఇవాళ తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తన ట్వీట్ లో పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు యశోద ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ కింద పడటంతో కేసీఆర్ గారికి తుంటి ఎముక విరిగిందని తెలిపారు. ఈ సాయంతం వైద్యులు కేసీఆర్ గారికి శస్త్ర చికిత్స చేస్తారని అన్నారు. కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దని.. కేసీఆర్ గారి ఆరోగ్యం కోసం అందరూ మీ ఇంటి వద్దనే ప్రార్ధన చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారన్నారు.
Next Story