Mon Dec 23 2024 07:43:22 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రోజులపాటు సీఎం జన్మదిన వేడుకలు : మంత్రి కేటీఆర్
ఈ ఏడాది సీఎం కేసీఆర్ పుట్టినరోజు సంబరాలను మూడ్రోజులు జరపాలని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
ఈ నెల 17వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఏటా కేసీఆర్ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు టీఆర్ఎస్ నేతలు. కానీ ఈ ఏడాది సీఎం కేసీఆర్ పుట్టినరోజు సంబరాలను మూడ్రోజులు జరపాలని మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన సీఎం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుందాం అని ఆయన తెలిపారు. సంబరాల్లో భాగంగా ఫిబ్రవరి 15,16,17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు, అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, ఆహారం, దుస్తులను పంపిణీ చేయాలని తెలిపారు. 16న అన్ని నియోజకవర్గాల్లో రక్తదానం, 17వ తేదీన సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలే కాకుండా.. ఈ మూడ్రోజుల పుట్టినరోజు సంబరాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు వ్యక్తిగతంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో భాగంగా ఎలాంటి సేవా కార్యక్రమాన్నయినా చేపట్టవచ్చని తెలిపారు.
Next Story