Wed Dec 25 2024 20:18:07 GMT+0000 (Coordinated Universal Time)
జేపీ నడ్డాకు కేటీఆర్ ట్వీట్
నుపుర్ శర్మను సస్పెండ్ చేసిన పార్టీ బండి సంజయ్ ను ఎందుకు వదిలేసిందని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటీఆర్ ట్వీట్ చేశారు. నుపుర్ శర్మకు ఒక నీతి? బండి సంజయ్ ఒక నీతిని పార్టీ అవలంబిస్తుందా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై విదాదస్పద వ్యాఖ్యలు చేసిని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను పార్టీ సస్పెండ్ చేసింది. నుపుర్ శర్మను సస్పెండ్ చేసిన పార్టీ బండి సంజయ్ ను ఎందుకు వదిలేసిందని కేటీఆర్ ప్రశ్నించారు.
బండిపై ఎందుకు?
బండి సంజయ్ మసీదులు తవ్వాలని, ఉర్దూ భాషను రద్దు చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి చర్యలు తీసుకోరా? అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయాన్ని బీజేపీ అవలంబిస్తున్నట్లుందని కేటీఆర్ అన్నారు.
Next Story