Mon Dec 23 2024 09:22:23 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : టీఎస్పీఎస్సీపై కేసీఆర్ నిర్ణయమిదే : కేటీఆర్
టీఎస్పీఎస్సీ పరీక్ష రద్దయినా గతంలో చెల్లించిన అభ్యర్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు
మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మరోసారి ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటామని కేటీఆర్ తెలిపారు. పరీక్ష రద్దయినా గతంలో చెల్లించిన అభ్యర్థులు తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరూ అర్హులేనని కేటీఆర్ అన్నారు. రద్దయిన నాలుగు పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ను ఆన్లైన్ లో ప్రభుత్వం అందుబాటులో పెడుతుందని కేటీఆర్ తెలిపారు. స్టడీ సర్కిల్స్ ను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. రీడింగ్ రూమ్స్, స్టడీ సెంటర్లో అభ్యర్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగ బద్దమైన సంస్థ అని, ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు.
ఎన్నో పరీక్షలు నిర్వహించినా...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత155 టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందని కేటీఆర్ తెలిపారు. 99 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిందన్నారు. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు. దేశంలోనే టీఎస్పీఎస్సీ సమర్థవంతమైన సంస్థగా పేరు పొందిందని చెప్పారు. టీఎస్పీఎస్సీలో అనేక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. దేశంలో ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించి, 37 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత టీఎస్‌పీఎస్సీదేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీపై ఆరోపణలు వచ్చినప్పటికీ, టీఎస్పీఎస్సీపై ఇంతవరకూ ఎలాంటి ఆరోపణలు రాలేదని కేటీఆర్. అనేక చర్యల వల్ల ఇప్పటి వరకూ సమర్థవంతంగా నడిచాయన్నారు. త్వరలోనే రద్దయిన పరీక్షలను నిర్వహిస్తాం.
ఇద్దరి వ్యక్తుల వల్లనే...
కేవలం ఇద్దరి వ్యక్తుల వల్ల టీఎస్పీఎస్సీకి చెడ్డపేరు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి నలుగురు మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రవీణ్, రాజశేఖర్ ల వెనక ఎవరున్నా వారిపై కఠినంగా శిక్షించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. వ్యవస్థలో లోపం కాదని, వ్యక్తిగత కారణాలతోనే శాపంగా మారిందని కేటీఆర్ అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని కేటీఆర్ తెలిపారు. నిరుద్యోగ యువత పెద్దమనసుతో అర్థం చేసుకోవాలన్నారు.
నిందితుడు బీజేపీయే...
నిరుద్యోగ యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. యువతలో అశాంతి రేపుతున్న వారు కూడా ఆలోచించుకోవాలన్నారు. టీఎస్పీఎస్సీ పై రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దని, అవన్నీ రాజకీయ నిరుద్యోగులు పట్టించుకోవద్దని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎవరైతే నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ క్రియాశీల కార్యకర్త అని, తాము ఇప్పటికే పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశామన్నారు. ఆయన వెనక ఎవరున్నారన్న దానిపై కూడా విచారణ జరపాలన్నారు. ఇందులో కుట్ర కోణం ఉందా? అని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయన్నారు. మంత్రులు బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. అనుమానాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పరీక్షలను రద్దు చేయాల్సి ఉంటుందని అన్నారు.
Next Story