KTR: చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను: కేటీఆర్ ట్వీట్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం ఎదురు చూడడమే. డిసెంబర్ 3న తెలంగాణలోని
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం ఎదురు చూడడమే. డిసెంబర్ 3న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్‌కే మొగ్గు చూపాయి. అసలు ఫలితాలు రావాలంటే 3వ తేదీ వరకు ఆగాల్సిందే. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు.
చాలా రోజుల తర్వాత నిన్న రాత్రి మంచి నిద్రపోయానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులున్నాయి.. ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోలేదన్నారు. కౌంటింగ్‌లో తమకు మంచి ఫలితాలు వస్తాయంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
అయితే, నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటి ఉందంటూ, ఫలితాలు కాంగ్రెస్‌కే మొగ్గు చూపిన తరుణంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్య పడాల్సిన అవసరం లేదని, హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నామంటూ చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయని, ఇప్పుడు కూడా అంతే అంటూ చెప్పారు. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తామంటూ స్పష్టం చేశారు కేటీఆర్.