Mon Dec 23 2024 07:44:30 GMT+0000 (Coordinated Universal Time)
Medaram : ఆదివారం.. మేడారానికి పోటెత్తిన భక్తులు
ఆదివారం మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు
ఆదివారం మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వనదేవతలను దర్శించుకునేందుకు పెద్దయెత్తున భక్తులు తరలి రావడంతో ఆలయం వద్ద రద్దీనెలకొంది. సమ్మక్క సారలమ్మ జాతర ముగిసినా అమ్మవారలను దర్శించుకునేందుకు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు.
అధిక సంఖ్యలో రావడంతో...
ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు వారిని నియంత్రించడం కూడా కష్టంగా మారింది. రహదారులన్నీ వాహనాలతో నిండిపోవడంతో అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అమ్మవార్లకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ముగిసి నెల రోజులయినా ప్రతి ఆదివారం భక్తుల వచ్చి దర్శించుకుంటుండటంతో పోలీసులు అక్కడ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story