Thu Dec 19 2024 06:00:27 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ అరెస్ట్
కరీంనగర్లో అర్థరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
కరీంనగర్లో అర్థరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు కరీంనగర్‌లోని ఆయన ఇంటివద్దకు అర్ధరాత్రి భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు బండి సంజయ్‌ను తరలించినట్లు తెలిసింది. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులోనే బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. బండి సంజయ్‌ను అరెస్ట్ ను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.
టెన్త్ ప్రశ్నాపత్రాలు...
ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి పదో తరగతి ప్రశ్నాపత్రాలను బండి సంజయ్ లీక్ చేయించారని పోలీసులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బండి సంజయ్ లోక్‌సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పార్టీ నేతలు మాత్రం బండి సంజయ్ ను కావాలనే అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని బీజేపీ నేతలు పిలుపు నిచ్చారు. అయితే బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారన్నది మాత్రం అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story