Sat Dec 28 2024 01:22:42 GMT+0000 (Coordinated Universal Time)
కార్తీక మాసంలో భక్తులకు గుడ్ న్యూస్.. సాగర్ లో లాంచీ ప్రయాణం
నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది
నాగార్జునసాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం వచ్చే నెల రెండో తేదీ నుంచి ప్రారంభం కానుంది. కార్తీక మాసం కూడా ఆరోజు నుంచి ప్రారంభం కానుండటంతో పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీ ప్రయాణం చేపట్టాలని నిర్ణయించింది. కార్తీక మాసంలో సందర్శకుల సందడి ఎక్కువగా ఉంటుంది. కృష్ణానదిలో లాంచీలో సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనపరుస్తారు. అందుకోసమే వారికోసం లాంచీ ప్రయాణాన్ని కార్తీక మాసంలో ఏర్పాటు చేసింది.
నవంబరు రెండు నుంచి...
నవంబరు 2వ తేదీ నుంచి ప్రతి శనివారం సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ రాకపోకలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక సంస్థ అధికారులు తెలిపారు. ీఈ ప్రయాణంలో కృష్ణానదిలో అనేక రకమైన అందాలను వీక్షించవచ్చని వారు తెలిపారు. సాగర్ నుంచి శ్రీశైలానికి పెద్దలకు రెండు వేల రూపాయలు, పిల్లలకు 1,600 రూపాయలు, వెళ్లి రావడానికి పెద్దలకు మూడు వేల రూపాయలు, పిల్లలకు 2,400 రూపాయలు టికెట్ ధర నిర్ణయించినట్లు వివరించారు.
Next Story