Mon Dec 23 2024 07:20:41 GMT+0000 (Coordinated Universal Time)
సీమాంధ్రులం కాము.. తెలంగాణీయులమే
తాము సీమాంధ్రులం కాదని, సెటలర్లు అసలే కాదని గ్రేటర్ రాయలసీమ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేతలు తెలిపారు
తాము సీమాంధ్రులం కాదని, సెటలర్లు అసలే కాదని గ్రేటర్ రాయలసీమ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేతలు తెలిపారు. కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగా విధ్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాటలకు తమకు సంబంధం లేదని వారు తెలిపారు. గ్రేటర్ రాయలసీమ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేతలు సమావేశమై ఈ విషయం వెల్లడించారు.
ఆ పంచాయతీతో...
కులాల పంచాయతీలతో తమకు సంబంధం లేదని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విధ్వేషాలను రెచ్చగొట్టటానికి తాము వ్యతిరేకమని గ్రేటర్ రాయలసీమ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నేతలు చెప్పారు. తాము సెటిలర్లం కామని, తెలంగాణీయులమేనని వారు చెప్పారు. ఇప్పటికైనా తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని వారు కోరుతున్నారు.
Next Story