Thu Nov 07 2024 12:56:09 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కేసీఆర్ దూరం.. కేటీఆర్ నేతృత్వంలోనే ముందుకు
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తిరిగి పార్టీని పరుగులు పెట్టించాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తుంది
లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తిరిగి పార్టీని పరుగులు పెట్టించాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ క్యాడర్ లో కొంత నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. రానున్న కాలంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రోడ్డుమీదకు రావాల్సిన తరుణంలో క్యాడర్ నిస్తేజంలో ఉండటాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. అందుకే పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రయత్నాలను ప్రారంభిస్తుంది.
వచ్చే నెల మూడోతేదీ నుంచి...
ఇందులో భాగంగా వచ్చే నెల మూడో తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటారని తెలిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోనే ఈ సమావేశాలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో కేటీఆర్ ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే కేసీఆర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని రెండు విడతల్లో సమావేశాలు తెలంగాణ భవన్ లో నిర్వహించాలని నిర్ణయించారు. సంక్రాంతికి మూడు రోజులు విరామం ఇచ్చి ఆ తర్వాత తిరిగి సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు.
Next Story