Sun Dec 14 2025 23:25:27 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కాంగ్రెస్ కండువా కప్పేసుకున్న గుత్తా
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. నల్లగొండ జిల్లాలో కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో వెళ్లారు. గుత్తా ఇంటికి వెళ్లి పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ పార్టీలో చేరాలని ఆహ్వానించారు.
రేవంత్ సమక్షంలో...
దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను ముఖ్యమంత్రి నివాసంలో పార్టీలో చేర్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి అమిత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. గుత్తా అమిత్ చేరికతో కాంగ్రెస్ కు నల్లగొండ జిల్లలో అదనపు బలం చేకూరినట్లయింది. బీఆర్ఎస్ నుంచి ఇంకా వలసలు కొనసాగుతూనే ఉనట్లు ఈచేరికతో స్పష్టమయింది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు భారీగా ఎదురుదెబ్బ తగలింది.
Next Story

