Sat Apr 05 2025 16:38:11 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు మీద చిరుత పులి.. భయపడిన ప్రయాణికులు
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో చిరుతపులి సంచారం కలకలం రేపింది

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిలో ఈ చిరుతపులి కనిపించింది. రోడ్డు దాటుతుండగా కొందరు వీడియో తీసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతపులి ఒక్కసారిగా రోడ్డు మీదకు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.
రాత్రి వేళ అటు వెళ్లేవారు...
తాము వాహనాల్లోనే ఉండి అద్దాలను పైకి లేపి చిరుతపులిని చూస్తూ ఉండిపోయారు. దీంతో శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై చిరుతపులి తిరుగుతుందని, రాత్రి వేళ తిరిగే వాళ్లు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. చిరుతపులి రోడ్డు దాటుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story