Mon Dec 23 2024 07:55:58 GMT+0000 (Coordinated Universal Time)
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృతి
కామారెడ్డి జిల్లా 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో
వన్య ప్రాణాలను కాపాడుకోడానికి అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అన్ని చర్యలు సఫలమవ్వడం లేదు. కొన్ని జంతువులు వేటగాళ్లకు బలవుతూ ఉండగా.. ఇంకొన్ని జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి. ముఖ్యంగా అడవులకు దగ్గరగా ఉండే రోడ్లపైకి వచ్చి చాలా జంతువులు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కామారెడ్డి జిల్లా 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పద్దెనిమిది నెలల చిరుతపులి మృతి చెందింది. బుధవారం రాత్రి 11 గంటలకు కంట్రోల్‌రూమ్‌కు కొందరు ఫోన్ చేసి చిరుతకు సంబంధించిన సమాచారం ఇచ్చారు. దీంతో కామారెడ్డి జిల్లా అటవీ అధికారిణి నిఖిత ఆధ్వర్యంలో అటవీశాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కామారెడ్డిలోని ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించారు. చిరుతపులిని వాహనం వేగంగా ఢీకొట్టడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందిందని నిఖిత తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు అధికారులు. చిరుతపులిపై వేటగాళ్లు దాడి చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి.
Next Story