DK Shivakumar: తెలంగాణలో కాకరేపుతున్న డీకే శివకుమార్ లేఖ
హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని కాంగ్రెస్ నేత, అక్కడి డిప్యూటీ సీఎం..
హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని కాంగ్రెస్ నేత, అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ రాశారన్న అంశంపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతోంది. అయితే ఫాక్స్‌కాన్ గ్రూప్‌కు తాను లేఖ రాశానన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ఖండించారు. డీకే శివకుమార్ పేరుతో లేఖ తెలంగాణలో సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం ఆగం అవుతుందని మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదంపై డీకే శివకుమార్ అసలు విషయాన్ని బట్టబయలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరుతో లేఖ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఆ లేఖను చూపిస్తూ కర్ణాటక ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరుతో లేఖ రాజకీయ దుమారానికి కారణమైంది.
ఈ లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్‌కాన్ సంస్థను కర్ణాటకకు తరలించాలని డీకే శివకుమార్ లేఖ రాశారన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కూడా డీకే శివకుమార్ ఆ లేఖలో స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలన్నీ కర్ణాటకకు పోతాయని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
అయితే ఫాక్స్‌కాన్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు డీకే శివకుమార్. అసలు ఆ లేఖ తాను రాయలేదంటూ ట్వీట్ చేశారు. కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేశానన్నారు డీకే శివకుమార్. లేఖపై ఆయన ఇచ్చిన వివరణతో ఈ వివాదం ఇక్కడితో ముగిస్తుందా..? మరో మారు దుమారం రేపుతుందా అనేది చూడాలి.