Sat Nov 23 2024 03:48:06 GMT+0000 (Coordinated Universal Time)
మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు
మెడికల్ షాపుల్లో నాసిరకం మందుల విక్రయాలతో పాటు.. అధిక ధరలకు మందులు విక్రయించే వారిపై చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలోని వివిధ మెడికల్ దుకాణాలలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాపుల్లో నాసిరకం మందుల విక్రయాలతో పాటు.. అధిక ధరలకు మందులు విక్రయించే వారిపై చర్యలు చేపట్టారు. అలాగే అనుమతులు లేకుండా మందులు విక్రయిస్తున్న దుకాణాలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు మెడికల్ షాపుల లైసెన్స్ లను డ్రగ్స్ కంట్రోల్ అధికారులు రద్దు చేశారు. కోఠిలోని ఇందర్ బాగ్ లో మెడికల్ షాపుల లైసెన్సు ను అధికారులు శాశ్వతంగా రద్దు చేశారు.
అంబర్ పేటలోని బయోస్పియర్ ఎంటర్ ప్రైజెస్, చార్మినార్ లోని భారత్ మెడికల్స్ దుకాణంలో మందుల విక్రయాలను సస్పెండ్ చేశారు. అలాగే అక్షయ మెడికల్ షాపు లైసెన్సును రద్దు చేశారు. లంగర్ హౌస్ ఆర్ఎస్ మెడికల్ షాపు లైసెన్సు కూడా రద్దు చేశారు. ఉప్పల్ లోని శ్రీ అయ్యప్ప మెడికల్, గౌలిగూడ గోకుల్ మెడికల్ షాపులో నిషేధిత మందులు విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇటీవల కాలంలో కొన్ని మెడికల్ షాపుల్లో వివిధ రకాల మందుల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మెడికల్ షాపుల్లో లభించే మందులతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో.. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అనుమానంతో మెడికల్ షాపులలో తనిఖీలు చేపట్టారు.
Next Story