Mon Dec 23 2024 10:48:37 GMT+0000 (Coordinated Universal Time)
ఈ మూడు రోజుల్లో తెగ తాగేశారు
నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డును
నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ సరికొత్త రికార్డును సృష్టించింది. డిసెంబర్ 31న 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయని తెలిపారు. ఒక్కరోజే తెలంగాణ ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్‌ల వద్ద రద్దీ కనిపించింది. మూడు రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో రూ.658 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. మొత్తంగా 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు, 6.31 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయి.
ఈ నెల 29, 30, 31 తేదీల్లో రూ.658 కోట్ల మేర మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్ లలో పెద్దఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీన రూ.313 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
Next Story