Tue Apr 01 2025 01:25:22 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నిన్న ఒక్కరోజే తెలంగాణలో ఎంత విలువైన మద్యం తాగారో తెలుసా?
న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి.

న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. తెలంగాణలో మామూలుగానే మద్యం విక్రయాలు అధికంగా ఉంటాయి. ఇక పండగలు పబ్బాలకు విక్రయాలు అధికంగా ఉంటాయి. అయితే న్యూ ఇయర్ లాంటి సమయంలో ఎక్కువ సేల్స్ ఉంటాయని అధికారులు అంచనా వేశారు. గత ఏడాది దాదాపు రెండు వందల కోట్ల రూపాయల మేరకు విక్రయాలు ఒక్కరోజులోనే జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
న్యూ ఇయర్ వేళ...
ఈ ఏడాది న్యూ ఇయర్ కు డిస్టలరీ నుంచి 282.20 కోట్ల విలువైన మద్యం బాటిళ్లను వైన్ షాపులకు, బార్లకు సరఫరా చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే భారీ గా మందుబాబులు తాగి ఊగి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకున్నారని ఎక్సైజ్ శాఖ అధికారులు అందించిన లెక్కలు చెబుతున్నాయి. గత డిసెంబరు నెలలో తెలంగాణలో 3,800 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయని చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story