Mon Dec 23 2024 08:11:09 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్... తిరిగి తెరుచుకునేది ఎప్పుడంటే?
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు కాసేపట్లో మూతపడనున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు కాసేపట్లో మూతపడనున్నాయి. సాయంత్రం ఆరు గంటలకు అన్ని వైన్ షాపులు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను కూడా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హోలీ పండగ సందర్భంగా వైన్ షాపులు మూసివేయాలని ఈ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హోలీ వేడుక సందర్భంగా...
రేపు హోలీ పండగ సందర్భంగా ఈ నిర్ణయాన్ని పోలీసులు, ఎక్సైజ్ శాఖ తీసుకుంది. తిరిగి 26వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకూ మద్యం దుకాణాలు తెరుచుకోవు. అంటే మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతబడినట్లే. హోలీ వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఏటా హోలీ పండగ సందర్భంగా మద్యం దుకాణాలను మూసివేస్తారు. హోలీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.
Next Story