Sun Mar 16 2025 12:04:08 GMT+0000 (Coordinated Universal Time)
Liqour Shops : మందుబాబులకు షాక్...నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్
నేటి నుంచి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి

నేటి నుంచి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో నేటి నుంచి మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో మద్యం దుకాణాలను ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి మూసివేయాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు.
ఈ జిల్లాల్లో...
ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలకు, బార్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకూ మద్యం దుకాణాలను తెరవకూడదని తెలిపారు. తెలంగాణలోని ఏడు జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలను మూడురోజుల పాటు మూసివేయనున్నారు. తెలంగాణలోని కల్లు దుకాణాలను కూడా బంద్ చేయాలంటూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Next Story