Fri Dec 20 2024 12:33:43 GMT+0000 (Coordinated Universal Time)
Liquor Shops : మూడు రోజులు మద్యం బంద్
నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో మద్యం షాపులు బంద్ కానున్నాయి
నేటి నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అన్ని వైన్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. బార్ల యజమానులకు కూడా ఇవే నిబంధనలు వర్తించనున్నాయి.
ఎన్నికల నిబంధనల మేరకే...
తెలంగాణ ఎన్నికలు ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి. పోలింగ్ కు ముందుగానే మద్యం దుకాణాలను ఆపివేయాలని నిబంధనలు సూచిస్తున్నాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలు నేడు బంద్ కానున్నాయి. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మద్యం దుకాణాలు మూసివేయకుంటే లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Next Story