Sun Dec 22 2024 19:55:28 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. దైవదర్శనానికి వెళ్తూ.. కానరానిలోకాలకు దంపతులు
మృతులు కాశీబుగ్గకు చెందిన మాధవి, మామిడాల సురేందర్ గా గుర్తించారు పోలీసులు. మృతి చెందిన దంపతుల్లో..
వరంగల్ లోని కాశీబుగ్గలో విషాదం చోటుచేసుకుంది. దైవ దర్శనానికి వెళ్తున్న దంపతులను మృత్యువు కబళించింది. శనివారం ఉదయం కాశీబుగ్గకు చెందిన కుటుంబం కారులో వేములవాడకు బయల్దేరింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి హైవేపై వెళ్తుండగా కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న దంపతులు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.
మృతులు కాశీబుగ్గకు చెందిన మాధవి, మామిడాల సురేందర్ గా గుర్తించారు పోలీసులు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మేఘన, అశోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దంపతుల మృతితో కాశీబుగ్గలో, ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story