Mon Dec 23 2024 06:41:27 GMT+0000 (Coordinated Universal Time)
హరీష్ రావు ఆస్తులపై ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు
మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్ రావు ఎవరు? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజ్గిరి నుంచి నేను, మెదక్ నుంచి నా కుమారుడు రోహిత్ చేస్తామని అన్నారు. తాను కచ్చితంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తామంటూ స్పష్టం చేశారు. తన కుమారుడు కూడా మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారని అన్నారు. ప్రస్తుతానికి తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని.. తనకు ఎప్పుడో టికెట్ కన్ఫామ్ చేశారని అన్నారు. మధ్యలో హరీష్ కలుగుజేసుకొని పెత్తనం చెలాయించడం కరెక్ట్ కాదని అన్నారు మైనంపల్లి. అవసరమైతే తన సత్తా ఏంటో చూపిస్తానని.. హరీష్‌ను ఆయన నియోజకవర్గంలో ఓడించేందుకు కూడా వెనకాడబోనని అన్నారు.
హరీశ్ రావు గతం గుర్తుంచుకోవాలి.. తన నియోజకవర్గంని వదిలి మా జిల్లాలో పెత్తనం చేస్తున్నాడు.. హరీశ్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోను.. అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడు..సిద్దిపేటలో హరీశ్ రావు అడ్రస్స్ గల్లంతు చేస్తా.. రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడు.. మెదక్‌లో నా తనయుడిని కచ్చితంగా గెలిపించుకుంటానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోహిత్ రెడ్డికి టికెట్ వస్తుందని హన్మంతరావు ఆశించారు. చివరి నిమిషంలో మెదక్ స్థానం నుంచి పద్మా దేవెందర్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు వార్తలు వినిపిస్తుండటంతో మైనంపల్లి హరీష్ రావుపై సీరియస్ అయ్యారు. హరీష్ రావు రాజకీయంగా ఎంతో మందిని అణిచివేశాడన్నారు. మెదక్‌లో తన తనయుడు.. మల్కాజ్‌గిరిలో తాను పోటీ చేస్తామని మైనంపల్లి తెలిపారు. మెదక్‌లో తన తనయుడుని కచ్చితంగా గెలిపించుకుంటానన్నారు.
Next Story