Sun Dec 22 2024 17:45:10 GMT+0000 (Coordinated Universal Time)
ఊహించని ట్విస్ట్.. తిట్టినా మైనంపల్లికి సీట్
మంత్రి హరీష్ రావును తిట్టినా మైనంపల్లి హనుమంతరావుకి సీట్ ఇవ్వడం విశేషం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి
ఎన్నికల సమరశంఖాన్ని సీఎం కేసీఆర్ ఊదారు. 2023 ఎన్నికలకు ఆరేడుగురు సిట్టింగ్లను మాత్రమే తప్పించామని, అందులోను బాగా పని చేసే అభ్యర్థులు కూడా ఉన్నారని చెప్పారు. ఉదాహరణకు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేశ్ పౌరసత్వం నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్నారు. మొత్తానికి పెద్దగా మార్పులు, చేర్పులు లేవన్నారు. బోథ్, అసిఫాబాద్, హైదరాబాద్లోని ఉప్పల్, కోరుట్లలో మాత్రమే మార్పులు చేసినట్లు చెప్పారు. ఎన్నికలు అంటే ఇతర పార్టీలకు రాజకీయమని విమర్శించారు. గుజరాత్, మహారాష్ట్రలను తలదన్నేలా తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు.
మంత్రి హరీష్ రావును తిట్టినా మైనంపల్లి హనుమంతరావుకి సీట్ ఇవ్వడం విశేషం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీశ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. మెదక్ లో హరీష్ రావు పెత్తనం చేస్తున్నారని, అంతు చూసే వరకు వదలబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో హరీష్ ను అడ్రస్ లేకుండా చేస్తానని అన్నారు. ఈరోజు ఉదయం తిరుమలకు వచ్చిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంత రావు తన కుమారుడికి మెదక్ సీటు ఇస్తేనే తాను పోటీ చేస్తానని అన్నారు. హరీష్ ఏ పరిస్థితుల్లో మెదక్ హాస్టల్ కు వచ్చారో అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. హరీష్ రాజకీయంగా ఎంతో మందిని అణిచివేసాడని మండిపడ్డారు. మల్కాజ్ గిరిలో తాను పోటీ చేస్తానని, మెదక్ లో తన కుమారుడిని ఖచ్చితంగా గెలిపించుకుంటానని చెప్పారు. అయితే మధ్యాహ్నం మైనంపల్లికి సీట్ కేటాయించినట్లు ప్రకటన వచ్చింది. ఈ సమయంలో ఆయన ఏమి చేస్తారో చూడాలి.
Next Story