Fri Dec 27 2024 07:50:29 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి మల్లారెడ్డి అల్లుడికే టిక్కెట్
మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని కేసీఆర్ ఖరారు చేశారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ పేరు ఖరారయింది.
మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ పేరును ఆయన ఖరారు చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో రాజశేఖర్ పోటీ చేయనున్నారు. దీంతో మామకు, అల్లుడికి చెరి ఒక నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ కేటాయించినట్లయింది. ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఓడించాలంటే రాజశేఖర్ మాత్రమే సరైన అభ్యర్థి అని కేసీఆర్ భావించి ఆయన పేరును ఖరారు చేశారు.
మల్కాజ్ గిరి నుంచి...
దీంతో మల్లారెడ్డి రేపు మల్కాజ్ గిరిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. పదిహేను వేల మంది ఈ సభకు హాజరయ్యేలా చూసేందుకు మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి మెదక్ సీటు దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి టిక్కెట్ మైనంపల్లి హన్మంతరావుకు ఖరారయినప్పటికీ ఆయన స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పేరును కేసీఆర్ కన్ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా భారీ చేరికలు ఉంటాయంటున్నారు.
Next Story