Sun Dec 22 2024 23:42:24 GMT+0000 (Coordinated Universal Time)
Etala Rajender : దమ్మున్నోడే పగ్గాలు చేపట్టాలి
మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పోరాటం చేసే వాళ్లే నియమితులు కావాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. దమ్మున్నోడు వస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. గల్లీ లీడర్లు, వీధి నాయకులు నాయకత్వం చేపడితే పార్టీ బలోపేతం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పోరాటం చేసే వాళ్లే...
సరైన సమయంలో పోరాటం చేయగలిగిన వాడే పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని ఈటల రాజేందర్ అన్నారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం ఎవరిని నియమించినా అభ్యంతరం ఉండదని అన్నారు. తెలంగాణలో రానున్న రోజులలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఎప్పటికైనా తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Next Story