Sun Dec 22 2024 16:37:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అమిత్ షాతో ఈటల భేటీ
ఈరోజు అమిత్ షాతో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు
ఈరోజు అమిత్ షాతో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు.ఈటల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే ఛాన్స్ ఉండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవడంతో ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారని ప్రచారం సాగుతుంది.
లోకల్ బాడీ ఎన్నికలు...
కానీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈటల రాజేందర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటల రాజేందర్ ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story