Tue Dec 24 2024 01:19:58 GMT+0000 (Coordinated Universal Time)
Azharuddin : అజారుద్దీన్ కు ఊరట
కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ కు మల్కాజ్ గిరి కోర్టు బెయిల్ మంజూరు అయింది.
కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ కు బెయిల్ మంజూరు అయింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్ గిరి కోర్టు తీర్పు చెప్పింది. అజారుద్దీన్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదు కావడంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అజారుద్దీన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బెయిల్ మంజూరు చేస్తూ...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నిధుల గోల్ మాల్ విషయంలో కొందరు చేసిన ఫిర్యాదుతో అజారుద్దీన్ తో పాటు మరికొందరిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. దీనిపై అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో దానిపై విచారించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
Next Story