Tue Dec 24 2024 00:57:34 GMT+0000 (Coordinated Universal Time)
పందికొవ్వుతో వంటనూనె.. రోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలో వాడేస్తున్నారు
తాజాగా పందికొవ్వుతో తయారు చేసిన నూనెను ఫ్రైడ్ రైస్ దుకాణాలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్
ఈ రోజుల్లో పిల్లలు, యువత ఇంట్లో అమ్మ వండిన వంటల్ని అస్సలు ఇష్టపడట్లేదు. మాకు అదొద్దు.. ఇదొద్దు అంటూ.. మారాం చేసి మరీ.. బజార్లో ఉండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లి ఫ్రైడ్ రైస్, న్యూడిల్స్ కొనుక్కుని.. అబ్బా ఏం టేస్ట్.. ఎంత బాగుందో అంటూ లాగించేస్తున్నారు. అలాంటి వారికి ఇది నిజంగానే షాకిచ్చేవార్త. ఫాస్ట్ ఫుస్ట్ సెంటర్లలో వాడే ఆయిల్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసిన విషయమే. అది తెలిసినా.. వాటినే తింటారు కొందరు. తాజాగా పందికొవ్వుతో తయారు చేసిన నూనెను ఫ్రైడ్ రైస్ దుకాణాలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇన్ స్పెక్టర్ రాములు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్ మెట్ పరిధిలోని ఆర్కేపురంలో నివాసం ఉండే రమేశ్ శివ (24) తన నివాసంలో కొన్నేళ్లుగా పంది కొవ్వుతో నూనెల్ని తయారు చేసి.. దానిని ఫ్రైడ్ రైస్ దుకాణాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పందిమాంసం విక్రయించే వారి నుంచి కొవ్వును సేకరించి.. దానిని వేడి చేసి, వివిధ రసాయనాలు కలిపి తీసిన నూనెను రోడ్ల పక్కన ఉండే ఫ్రైడ్ రైస్ దుకాణదారులకు తక్కువ ధరకు విక్రయిస్తూ లబ్ధిపొందినట్లు పోలీసులు తెలిపారు. రమేశ్ పై తమకు సమాచారం అందగా.. నివాసంపై ఆకస్మికదాడులు చేసి సోదాలు చేయగా.. పందికొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు తేలిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే.. జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెలను వాడే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story