Fri Apr 18 2025 20:18:12 GMT+0000 (Coordinated Universal Time)
Manchu Manoj : తల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. అవేమీ నాకొద్దు
తాను ఏరోజు ఆస్తికోసం కొట్లాటకు దిగలేదని మంచు మనోజ్ అన్నారు

తాను ఏరోజు ఆస్తికోసం కొట్లాటకు దిగలేదని మంచు మనోజ్ అన్నారు. తప్పుడు సంతకాలతో న్యాయస్థానాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.తన తల్లిమీద ఒట్టేసి చెబుతున్నా తానంటే మంచు విష్ణుకు కుళ్లు అని మంచు మనోజ్ అన్నారు. ఏప్రిల్ 2వ తేదీన తన కూతురు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుందామని జల్ పల్లి వచ్చామని అన్నారు. ఇక్కడ పరిస్థితులు బాగాలేకపోవడంతో తాము జైపూర్ కు వెళ్లామని మంచు మనోజ్ అని తెలిపారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా తనను లోపలకి అనుమతించడం లేదని మంచు మనోజ్ తెలిపారు.
మూడు నెలల నుంచి...
గత మూడు నెలల నుంచి ఒక్క ఛార్జిషీట్ కూడానమోదు చేయలేదని మంచు మనోజ్ తెలిపారు. తన వస్తువులను తీసుకుందామని వచ్చామని తెలిపారు. తాను జైపూర్ వెళ్లగానే తన వస్తువులను బయటకు తరలించారని మంచు మనోజ్ ఆరోపించారు. జల్ పల్లి ఇంట్లో తనకు సంబంధించిన మూడు పెట్స్ ఉన్నాయని, వాటిని తనకు అప్పగించాలని కోరుతున్నానని తెలిపారు. తాను ఆస్తి అడిగినట్లు ఒక ఆధారం చూపినా తాను ఏం చేసినా తలవంచుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని మంచు మనోజ్ తెలిపారు.
Next Story