Mon Dec 23 2024 06:04:21 GMT+0000 (Coordinated Universal Time)
టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ గా మంద భీంరెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగంప్రముఖ ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డిని నియమిస్తూ టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం (టిపిసిసి ఎన్నారై సెల్) కన్వీనర్ గా వలస వ్యవహారాల విశ్లేషకులు, ప్రముఖ ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డిని నియమిస్తూ టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బి.ఎం. వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవాసి భారతీయ దివస్ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ లో నియామక పత్రాన్ని అందజేశారు.
కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడానికి గురుతరమైన బాధ్యత స్వీకరించాలని ఆశీర్వదించిన ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డికి, టిపిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, నియామకపత్రం ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నారై సెల్ చైర్మన్ డా. వినోద్ కుమార్ కు మంద భీంరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story