Mon Dec 23 2024 02:44:28 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎన్ కౌంటర్ బూటకం.. ప్రతీకారం తీర్చుకుంటాం
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్ పేరుతో లేఖ విడుదలయింది. పెసలుపాడు ఎన్ కౌంటర్ జరగలేదని, ఆరుగురు మావోయిస్టులు పట్టుకుని పోలీసులు కాల్చి చంపారని ఆ లేఖలో పేర్కొన్నారు.
పట్టుకుని కాల్చి ...
ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు తమ దళంపై దాడికి దిగారన్నారు. అయితే పట్టుకుని కాల్చి చంపి ఎన్ కౌంటర్ అని పోలీసులు కధలు అల్లుతున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆ లేఖలో హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు ఈ ఎన్ కౌంటర్ ప్రతీకారంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
Next Story