Fri Dec 20 2024 14:19:50 GMT+0000 (Coordinated Universal Time)
కాళేశ్వరం కుంగిపోవడంపై మావోయిస్టుల లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. నాసిరకం పనుల కారణంగానే కుంగిపోయిందన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ వహించాలన్నారు. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు 30 మీటర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అని ఆ లేఖలో పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీని నిర్మించి కేవలం మూడు సంవత్సరాలే అయిందని, దీన్ని 2016 మే 2వ న నిర్మాణం చేపట్టి 2019 జూన్ 21న ప్రారంభించారని తెలిపారు.
కూలి పోవడానికి కారణం...
ఈ బ్యారేజీ త్వరలోనే కూలి పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబమే అని లేఖలో మావోయిస్టులు తెలిపారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారని లేఖలో విమర్శించారు. ప్రాజెక్టును నిర్మిస్తున్న సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయని, కానీ ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనివ్వ లేదన్నారు. ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను సహితం రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసు ఫోర్స్తో ముందస్తుగా అరెస్టులు చేసి వారిని ధర్నాలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.విషయం బయటకు రాకుండా అణిచివేశారని, మీడియాను కూడా బెదిరించి కంట్రోల్ చేశారన్నారు. ప్రజాధనం వృధా చేసిన కేసీఆర్ దే పూర్తి బాధ్యత అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు
Next Story