Sun Dec 22 2024 16:12:41 GMT+0000 (Coordinated Universal Time)
కరీంనగర్ పూజారుల కన్యాశుల్కం
పెళ్లిళ్లు చేయడానికి మధ్యవర్తులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇరువర్గాల నుంచి కమీషన్లు తీసుకుంటూ పెళ్లిళ్లను చేయడానికి
పూజారి వృత్తిలో ఉన్న వాళ్లకు ఆడపిల్లలను ఇవ్వడానికే భయపడుతూ ఉన్నారు. కరీంనగర్ ఇతర జిల్లాల్లో పూజారులుగా, వంటవాళ్ళుగా పనిచేస్తున్న బ్రాహ్మణ వరులకు సరైన జోడీ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో వధువుల కోసం వెతుకుతూ ఉన్నారు. అంతేకాకుండా కన్యాశుల్కం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. పౌరోహిత్యం చేస్తున్న అబ్బాయిలకు పిల్లలు దొరకడం లేదని వారి తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. సమస్య చాలా తీవ్రంగా ఉందని అంటున్నారు. పూజారులకు మంచి సంపాదన ఉన్నప్పటికీ బ్రాహ్మణ యువతులు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్లను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. బ్రాహ్మణ బాలికల తల్లిదండ్రులు పూజారులుగా, వంటవారిగా పనిచేస్తున్న వారిని పూర్తిగా తిరస్కరిస్తున్నారు.
పెళ్లిళ్లు చేయడానికి మధ్యవర్తులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇరువర్గాల నుంచి కమీషన్లు తీసుకుంటూ పెళ్లిళ్లను చేయడానికి సిద్ధమయ్యారు. ‘కన్యాశుల్కం’ అనే డిమాండ్ కూడా ఈ మధ్య బయటపడింది. మంచి అమ్మాయి దొరికితే 3 లక్షల వరకు కన్యాశుల్కం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి అబ్బాయిల కుటుంబాలు. మహారాష్ట్ర, యూపీకి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకుని హైదరాబాద్, కరీంనగర్ లలో రిసెప్షన్స్ ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కరీంనగర్ మరియు పొరుగు జిల్లాల్లోని 30-40 సంవత్సరాల వయస్సు ఉన్న బ్రాహ్మణ అబ్బాయిలకు అమ్మాయి దొరకడమే కష్టమైపోయింది. ఇంకొంత మంది అబ్బాయిలకు పెళ్లి మీద ఆసక్తి కూడా వెళ్ళిపోయింది. వాట్సాప్ గ్రూపులలోని బ్రాహ్మణ సంఘాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సంపాదించినంత సంపాదిస్తున్న పూజారులు, వంటవారి నుండి వచ్చే సంబంధాలను కూడా పరిగణించమని అమ్మాయిల తల్లిదండ్రులను కోరుతూ ఉన్నారు. కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా పేరుపొందింది.
Next Story