Mon Dec 23 2024 07:20:01 GMT+0000 (Coordinated Universal Time)
Mounika : పెళ్లయినా... సెటిల్ అవుదామన్న ఈ బంగారుతల్లి కసి చూడండి.. మూడు ప్రభుత్వోద్యోగాలు సాధించి
నాలుగేళ్లలో మూడు ప్రభుత్వోద్యోగాలను సాధించి కోరుట్లకు చెందని మౌనిక అందరి ప్రశసంలను అందుకుంటుంది
ఈ జనరేషన్ లో సెల్ ఫోన్లకు బానిసలు అయ్యేవాళ్లు కొందరైతే.. ఫ్యూచర్ కోసం కష్టపడే వారు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. తమ జీవితం సాఫీగా సాగాలనుకుని భవిష్యత్ ప్రణాళికను రచించుకునే యువతీ యువకుల సంఖ్య కూడా ఎక్కువగా కనపడుతుంది. గతంలో మాదిరిగా నిర్వేదం, నైరాశ్యం వారిలో కనిపించడం లేదు. కొందరు యువతీ యువకులు సాధించిన విజయాలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. కుటుంబాలకే కాదు.. వారు సమాజానికి కూడా మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. కేవలం చదువుకోవడమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగమూ దొరకడమే కష్టంగా భావించే నేటి రోజుల్లో వచ్చిన అవకాశాలను వెంటనే సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
నాలుగేళ్లలో....
నాలుగేళ్లలో మూడు ప్రభుత్వోద్యోగాలను సాధించి మరో యువతి వార్తల్లో నిలిచింది. అయితే పెళ్లి అయిన తర్వాత ఈ యువతి సాధించిన విజయాన్ని చూసి అందరూ అబ్బురపడుతున్నారు. కోరుట్లకు చెందిన మౌనికకు గత నాలుగేళ్లలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలంటే ఈరోజుల్లో మాటలా? ఎంత కష్టపడాలి? ఎంత చదవాలి? చదవడం ఒక ఎత్తైతే .. పరీక్షలో తాము అనుకున్నది అనుకున్నట్లు ప్రెజెంట్ చేయడం మరొక ఎత్తు. అందుకే ఇప్పటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపిక అంత సులువు కాదు. ఎంపికయ్యేంత వరకూ టెన్షన్ తప్పదు. కానీ మౌనికకు మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా సులువుగా నాలుగు ఉద్యోగాలను అలవోకగా కొట్టేసింది.
ఉద్యోగం చేస్తూనే...
మౌనిక తండ్రి వేణు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 2013లో ఎంఫార్మసీలో మౌనిక గోల్డ్ మెడల్ సాధించింది. మౌనికకు వివాహం కూడా అయింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ను వివాహం చేసుకున్న మౌనిక తాను చదువుకున్న దానికి సార్థకత ఉండాలని భావించి కష్టపడి చదవడం ప్రారంభించింది. 2019లో వీఆర్వో పోస్టు వచ్చింది. దానితో సంతృప్తి పడని మౌనిక ఫార్మాసిస్టు పరీక్ష రాసి ఎంపికయింది. హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మాసిస్టు ఉద్యోగం చేస్తున్నా అది తనకు సరిపోతుందని భావించలేదు. రెండేళ్ల క్రితం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో పరీక్ష రాసింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సెలెక్ట్ అయింది. రాష్ట్ర స్థాయిలోనే మొదటి ర్యాంకు సాధించిన మౌనికను కుటుంబ సభ్యులే కాదు.. కోరుట్ల లోని ప్రజలు అభినందిస్తున్నారు. నేటి యువతరానికి మౌనిక స్ఫూర్తి కాక మరేంటి?
Next Story