Sat Nov 23 2024 01:15:31 GMT+0000 (Coordinated Universal Time)
ఈటల ఆక్రమించింది నిజమే
జమున హ్యాచరీస్ భూముల్లో అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు కూడా ఉన్నాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు.
జమున హ్యాచరీస్ భూముల్లో అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు కూడా ఉన్నాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. తాము జరిపిన విచారణలో సర్వే నెంబరు 130, 81లలో సీలింగ్ భూములు, అసైన్డ్ భూముులున్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ ఎస్సీ, ముదిరాజ్, వంజర వంటి సామాజికవర్గాలు ఉన్నాయన్నారు. వీరిలో 56 మందికి చెందిన 70 ఎకరాల భూమిని జమునా హేచరీస్ దౌర్జన్యంగా లాక్కుందని కలెక్టర్ తెలిపారు.
కాలుష్య పదార్థాలను....
వారిని బెదిరించి లాక్కుని అక్కడ పెద్దయెత్తున షెడ్ల నిర్మాణం చేసిందన్నారు కలెక్టర్ హరీశ్. షెడ్ల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా ఎల్క చెరువు, హల్డి వాగులోకి వ్యర్థాలను కూడా విడుదల చేస్తున్నారని స్థానికులు తమకు ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపినట్లు ఆయన వెల్లడించారు.
Next Story