Fri Nov 22 2024 03:05:38 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లందరినీ కోర్టుకు ఈడుస్తా.. అక్కకు తమ్ముడిగా నిలబడతా
ఒక అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానంటూ మెదక్ ఎంపీ రఘునందనరావు హెచ్చరించారు.
ఒక అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానంటూ మెదక్ ఎంపీ రఘునందనరావు హెచ్చరించారు. పోస్టు పెట్టిన అకౌంట్ డీపీ పై హరీష్ రావు, కేసీఆర్ ఫోటోలున్నాయని, బీఆర్ఎస్ కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా.? అని ఆయన ప్రశ్నించారు.పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించాలని, లేకుంటే మీకు సంబంధం లేదని, మీరు జీతం ఇవ్వడం లేదని అనుకుంటే మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండని కోరారు. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశానని, దీనికి సంస్కార హీనంగా పోస్టులు పెట్టడమేంటని ప్రశ్నించారు.
అక్క, తమ్ముడి సంబంధాన్ని...
తల్లి అక్క చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టారన్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశానని, అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశానన్న రఘునందన్ రావు అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు దీనిపై స్పందించి సోషల్ మీడియా ను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. తమ ఫోటోలు వాడుకుంటున్నారు అనుకుంటే పోలీసు కంప్లయింట్ ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
Next Story