Fri Dec 20 2024 22:39:03 GMT+0000 (Coordinated Universal Time)
పతకాలను గెలుచుకున్న తెలంగాణ పోలీసులు వీరే
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొత్తం 954 మంది పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ లభించాయి
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొత్తం 954 మంది పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ లభించాయి. తెలంగాణకు చెందిన 34 మంది పోలీసు సిబ్బంది వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PPMG) ఒక CRPF సిబ్బందికి, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG) 229 మందికి, రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ విశిష్ట సేవ (PPM) 82 మందికి, 642 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది. అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం(PPMG) సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రక్పామ్ ఇబోంచా సింగ్ అందుకోనున్నారు.
తెలంగాణ నుంచి 34 మంది ఈ పతకాలకు ఎంపికయ్యారు. 22 మందికి పోలీస్ గ్యాలంటరీ, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు, మరో ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు దక్కాయి. ఏపీ నుంచి 29 మందికి ఈ పతకాలు దక్కాయి. 18 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, ఒకరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు అందుకోనున్నారు. పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్నవారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 55 మంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్గఢ్ నుంచి 24 మందికి పీఎంజీ పతకాలు దక్కాయి.
తెలంగాణ నుంచి పోలీస్ సేవా పతకాలు లభించిన పది మంది పోలీసుల వివరాలు :
బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ,ఖైరతాబాద్.. మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, అదనపు ఎస్పీ.. ఆత్మకూరి వెంకటేశ్వరి, అదనపు ఎస్పీ... ఆందోజు సత్యనారాయణ, ఆర్ఎస్ఐ... కక్కెర్ల శ్రీనివాస్, ఆర్ఎస్ఐ... మహంకాళి మధు, ఆర్ఎస్ఐ... అజెల్ల శ్రీనివాస రావు, ఆర్ఐ... రసమోని వెంకటయ్య, సీనియర్ కమాండో... అరవేటి భాను ప్రసాద్ రావు, ఇన్ స్పెక్టర్,హైదరాబాద్... సాయన వెంకటేశ్వరులు, ఏఎస్ఐ.
తెలంగాణకు చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు:
ఎస్పీ భాస్కరన్, ఇన్ స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కాన్ స్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు. గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కాన్స్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్.
తెలంగాణ నుంచి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు పొందిన వాళ్ల వివరాలు:
విజయ్ కుమార్.. అదనపు డీజీ
మదాడి రమణ కుమార్.. ఎస్పీ
Next Story