Thu Apr 10 2025 02:17:12 GMT+0000 (Coordinated Universal Time)
మేడారం సమ్మక్క పూజారి గుండెపోటుతో మృతి
కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపమైన సమ్మక్క దేవతను సిద్దబోయిన, చందా, కొక్కెర, ఎంపెళ్లి వంశస్తుల చేతుల మీదుగా ..

ఏటూరు నాగారం : మేడారం సమ్మక్క పూజారి సిబ్బబోయిన సాంబయ్య బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఈ తెల్లవారుజామున సాంబయ్య గుండెనొప్పితో ఇబ్బంది పడగా.. కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంల ఏటూరు నాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాంబయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాంబయ్య మృతితో మేడారం పూజారులు, ఆదివాసీలు, మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపమైన సమ్మక్క దేవతను సిద్దబోయిన, చందా, కొక్కెర, ఎంపెళ్లి వంశస్తుల చేతుల మీదుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సిబ్బబోయిన వంశానికి చెందినవారిలో ఒకరైన సాంబయ్య ఇటీవల జరిగిన మేడారం జాతరలోనూ చురుగ్గా పాల్గొన్నారు. సమ్మక్క పూజలు నిర్వహించడం, చిలుకల గుట్ట నుండి సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకురావడంలో సహచర పూజారులతో కలిసి చురుకైన పాత్ర పోషించారు. సాంబయ్య మృతి పట్ల తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ములుగు MLA సీతక్క ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
News Summary - Medaram Priest Sibbaboina Sambayya Died of heart stroke
Next Story