Sat Nov 23 2024 02:27:33 GMT+0000 (Coordinated Universal Time)
Medaram : మేడారం వెళ్లాలంటే ఇవి తప్పనిసరి
మేడారం సమ్మక్క సారలమ్మ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
మేడారం సమ్మక్క సారలమ్మ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే మేడారం జాతరకు ఆ రెండు రోజులు వెళ్లే భక్తులు మాత్రం విధిగా కొన్ని షరతులు విధించారు. మేడారం వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆధార కార్డును తీసుకెళ్లాలని ప్రభుత్వం తెలిపింది. అక్కడ సమ్మక్క సారలమ్మకు సమర్పించే ఎత్తు బంగారాన్ని సమర్పించే భక్తులు కొన్ని నిబంధనలు పాటించాలని కోరింది. తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం జాతరకు ఆరు వేల బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఇవీ నిబంధనలు...
ఎత్తు బంగారాన్ని సమర్పించే భక్తుల వివరాలను సేకరించాలని ఎక్సైజ్ శాఖ స్థానిక అధికారులను ఆదేశించింది. భక్తుల నుంచి ఆధార్తో పాటు ఫోన్ నెంబరు తీసుకుని బెల్లాన్ని విక్రయించాలని వ్యాపారులను కోరింది. ఇంటి అడ్రస్ ను కూడా తీసుకోవాలని తెలిపింది. అప్పుడే బెల్లాన్ని విక్రయించాలని పేర్కొంది. గుడుంబా తయారీకి బెల్లం పక్కదారి పట్టే అవకాశం ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఈ నిబంధనలు విధించింది. గుడుంబా తయారీకి బెల్లాన్ని విక్రయిస్తే లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని వ్యాపారులను హెచ్చరించింది.
Next Story