Sun Dec 22 2024 15:36:13 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మెడికల్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట
మెడికల్ పీజీ విద్యార్థులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది
మెడికల్ పీజీ విద్యార్థులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణలో ఎంబీబీఎస్ పీజీ చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ చదివిన వారిని లోకల్స్ గా పరిగణించాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేసింది.
ప్రభుత్వ జీవోను...
తెలంగాణ ప్రభుత్వం వారిని నాన్ లోకల్ గా పరిగణించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులును రద్దు చేసింది. జీవో కొట్టి వేయడంతో తెలంగాణలో బీడీఎస్, ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు ఇక్కడ లోకల్ గానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టి వేయడంతో మెడికల్ విద్యార్థులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
Next Story