Mon Dec 23 2024 04:48:51 GMT+0000 (Coordinated Universal Time)
మెడికో ప్రీతి మరణంపై తండ్రి, సోదరుడు సంచలన వ్యాఖ్యలు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు ప్రీతిది ఆత్మహత్యేనని తాము నమ్ముతున్నామని, కేసు దర్యాప్తు కూడా..
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన మెడికో ప్రీతి నాయక్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. ఆమెది ఆత్మహత్యేనా ? లేక ఎవరైనా కావాలని ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేశారా ? అన్న అనుమానాలు చాలామందిలో మెదిలాయి. తాజాగా.. ప్రీతి మరణంపై ఆమె తండ్రి, సోదరుడు మీడియాతో మాట్లాడారు. మెడికో ప్రీతిది ఆత్మహత్యేనని.. ఆమె అలా చేసుకోడానికి ప్రధాన కారణం సైఫ్ అని సీపీ రంగనాథ్ శుక్రవారం తెలిపారు.
ఈ నేపథ్యంలో శనివారం ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు సీపీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన కూతురు ప్రీతిది ఆత్మహత్యేనని తాము నమ్ముతున్నామని, కేసు దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగానే జరుగుతోందన్నారు. ప్రీతిది ఆత్మహత్య అని చెబుతూ, కొన్ని ఆధారాలను చూపించారన్నారు. అయితే ఛార్జిషీటులో ఇంకొందరి పేర్లు చేర్చాల్సి ఉందని సీపీకి తెలిపామన్నారు. కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ఓడీల బాధ్యతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రీతి తండ్రి నరేందర్ పేర్కొన్నారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సీపీని కోరామన్నారు. ఇటీవలే సైఫ్ బెయిల్ పై బయటికి వచ్చాడు.
Next Story