Mon Dec 23 2024 00:21:19 GMT+0000 (Coordinated Universal Time)
మెడికో ప్రీతికి బ్రెయిన్ డెడ్.. వైద్యుల కీలక ప్రకటన
ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రి చుట్టూ.. పోలీసుల భద్రతను పెంచారు. కొద్దిసేపటిలో నిమ్స్ వైద్యులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై
కళాశాలలో వేధింపులు భరించలేక వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి అత్యధిక డోస్ లో అనస్థీషియా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై తండ్రి మీడియాతో మాట్లాడారు. ప్రీతి కోలుకుంటుందన్న నమ్మకం లేదని వైద్యులు తెలిపారన్నారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని చెబుతున్నారని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన కూతురు బ్రతికి.. మళ్లీ తిరిగివస్తుందన్న ఆశలు లేవన్నారు. మొదటిరోజుతో పోలిస్తే ఇంకా పరిస్థితి ఇంకా క్షీణించిందని చెప్పారు. తన కూతురికి ఈ పరిస్థితి రావడానికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని ఆయన మీడియా ముఖంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బ్రతుకుతుందన్న నమ్మకం ఒక్కశాతం మాత్రమే ఉన్నట్లు చెప్పారు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.
ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిమ్స్ వైద్యులు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆస్పత్రి చుట్టూ.. పోలీసుల భద్రతను పెంచారు. నిమ్స్ వైద్యులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుపడ లేదని, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. నిపుణుల బృందం ఆధ్వర్యంలో విద్యార్థినికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మరోసారి రాత్రి 8 గంటలకు ప్రీతి ఆరోగ్యంపై మరో బులెటిన్ విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. ఆమెను వేధించిన సైఫ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆమె ఆత్మహత్యాయత్నానికి ముందు తన తల్లికి ఫోన్ చేసినట్లు తెలిసింది. ఈ ఫోన్ కాల్కి సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. తన సీనియర్ వేధింపులు భరించలేకపోతున్నానని, చదువుకోలేకపోతున్నానంటూ ప్రీతి తన బాధను తల్లితో పంచుకుంది. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Next Story