Mon Dec 23 2024 00:03:08 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం..కీలక నిర్ణయాలివే
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. రెండు కమిటీలను వేయాలని నిర్ణయించారు
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ప్రజాభవన్ లో ఆరు గంటలకు ప్రారంభమయిన ఈ సమావేశం ఎనిమిది గంటలకు ముగిసింది. అంటే రెండు గంటల పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించారు. అయితే ఇది ప్రారంభ సమావేశం కావున మంత్రుల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయించినట్లు ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.
రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని...
మంత్రులతో పాటు ఈ కమిటీల్లో అధికారులు కూడా ఉంటారు. రెండు కమిటీలో ఒకటి మంత్రుల కమిటీ కాగా, రెండోది అధికారుల కమిటీ గా ఉంటుందని చెబుతున్నారు. మంత్రుల కమిటీలోనూ, అధికారుల కమిటీలోనూ రెండు రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. మొదటి సమావేశం మంచి వాతావరణంలోనే జరిగిందని అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో మరిన్ని సమావేశాలు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు.
Next Story