Mon Dec 23 2024 01:13:05 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మునుగోడులో కాంగ్రెస్ ఛార్జిషీట్
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ లపై ఛార్జిషీట్ విడుదల చేయనుంది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశం జరగనుంది. అక్కడ బీజేపీ, టీఆర్ఎస్ లపై ఛార్జిషీట్ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డి తో పాటు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ఆహ్వానాలు వెళ్లాయి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్, బీజేపీలు కేంద్రంలో, రాష్టంలో అనుసరిస్తున్న విధానాలపై ఈ ఛార్జిషీటు వేయనున్నారు.
కోమటిరెడ్డి హాజరుపైనే...
అయితే ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రియాంక గాంధీ తో భేటీ తర్వాత తాను మునుగోడు ప్రచారానికి వెళతానని కోమటిరెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ మునుగోడులో ప్రచారం ప్రారంభించనుంది. టీఆర్ఎస్, బీజేపీలపై విడుదల చేసే ఛార్జిషీట్ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొంటారా? లేదా? అన్నది చూడాలి.
Next Story