Mon Dec 23 2024 17:11:03 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి కేటీఆర్ తో మేఘాలయ సీఎం భేటీ !
అనంతరం మంత్రి కేటీఆర్, సంగ్మా తెలంగాణ - మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నట్లు
హైదరాబాద్ : మేఘాలయ రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. శుక్రవారం ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ - శైలిమ దంపతులను సీఎం సంగ్మా దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంగ్మా దంపతులను కేటీఆర్ దంపతులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్, సంగ్మా తెలంగాణ - మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో వీరిద్దరి సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కేటీఆర్ తో భేటీ కావడం సంతోషంగా ఉందని సంగ్మా తెలిపారు. అలాగే సంగ్మాతో సమావేశమవడం పట్ల కేటీఆర్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
Next Story