Thu Apr 10 2025 22:40:48 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను చంపుతామంటున్నారు : కోమటిరెడ్డి
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరింపులు వస్తున్నాయంటూ ఆయన ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు తనను ఫోన్ లో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెదిరింపులు వస్తున్నాయంటూ...
ఇటీవలే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చెరుకు సుధాకర్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని సన్నిహితులు చెబుతున్నారు.
Next Story