Mon Dec 23 2024 07:13:25 GMT+0000 (Coordinated Universal Time)
అప్పుడే నేను మాట్లాడతా
భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువన్నారు.
భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఆత్మాభిమానం ఎక్కువన్నారు. తనను ఎవరూ ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేదని చెప్పారు. తనను కలిసినా ప్రయోజనం ఉండదని చెప్పారు. తనపై దుర్భాష లాడిన చెరుకు సుధాకర్ ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
వారిద్దరినీ తొలగిస్తే...
తనను అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్ పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఇంకా పార్టీలో కొనసాగిస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిలదీశారు. వారిద్దరినీ పార్టీ నుంచి తొలగించి అప్పుడు మాట్లాడాలని ఆయన షరతు విధించారు. తాను పార్టీలోనే ఉంటూ ఇక్కడే తేల్చుకుంటానని ఆయన చెప్పారు. పార్టీని వదిలి పెట్టే ప్రసక్తి లేదని కూడా ఆయన పునరుద్ఘాటించారు.
Next Story