Mon Dec 15 2025 00:13:03 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు ప్రచారానికి వెళ్లను
తాను మునుగోడు ప్రచారానికి వెళ్లనని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటెరెడ్డి స్పష్టం చేశారు

తాను మునుగోడు ప్రచారానికి వెళ్లనని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటెరెడ్డి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. చుండూరు సభలో తనను కావాలని అసభ్యంగా తిట్టించారని అన్నారు. తనను హోంగార్డుతో పోల్చారని ఆయన అన్నారు. తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రేవంత్ ఆస్తులు ఎన్ని? రాజగోపాల్ ఆస్తులు ఎన్ని తేల్చాలన్నారు
ఏం చేసి సంపాదించారు?
రేవంత్ రెడ్డి ఏం వ్యాపారాలు చేసి సంపాదించారో చెప్పాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నిక సమావేశంపై తనకు సమాచారం ఇవ్వలేదననారు. తనను పంపించేసి కాంగ్రెస్ ను ఖాళీ చేయాలనుకుంటున్నారని కోమటిరెడ్డి వెంకటెరెడ్డి అన్నారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ఠాగూర్ తన ఇంటికి ఎందుకు రాలేదని ఆయన అన్నారు. ఏ విషయమూ తాను సోనియా, రాహుల్ గాంధీల వద్దనే తేల్చుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
Next Story

