Sun Dec 22 2024 21:38:24 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఐదుగురు అరెస్ట్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వైరల్ చేసిన కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం సభ్యులను అదుపులోకి తీసుకున్నారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను వైరల్ చేసిన కాంగ్రెస్ సోషల్ మీడియా టీంలో ఐదుగురు సభ్యులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అమిత్ షా వీడియోను వైరల్ చేస్తూ పార్లమెంటు ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపేలా ఈ టీం సభ్యులు ప్రయత్నించారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు సభ్యులను సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఐదుగురిఅరెస్ట్...
రాజ్యాంగాన్నిమార్చి రిజర్వేషన్లు తొలగిస్తామంటూ అమిత్ షా అన్నట్లు ఒక వీడియోను మార్ఫింగ్ చేయడమే కాకుండా దానిని పెద్దయెత్తున వైరల్ చేయడంతో ఈ ఎన్నికల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసుల కంటే ముందుగానై సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story