Fri Apr 04 2025 17:03:29 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : ఎండలు దంచికొడుతున్న వేళ గుడ్ న్యూస్
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఈరోజు నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకూ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది. ఇప్పటి వరకూ 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో ఇది కూల్ కబురు అని ఖచ్చితంగా చెప్పాలి. ఉక్కపోత, ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ వాతావరణ శాఖ చేసిన ఈ ప్రకటనతో కొంత ఊరట దక్కినట్లయింది.
తేలికపాటి జల్లులు...
తేలికపాటి జల్లులయినప్పటికీ ఎండలకు తాళలేకపోతున్న ప్రజలకు ఒకింత ఉపశమనం కలుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎండలకు చెమటలు కక్కుతున్నారు. ప్రతి రోజూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో తేదీన వర్ష ప్రభావం కొంత తక్కువగా ఉన్నా ఏప్రిల్ 3, 4 తేదీల్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. అంటే 35 డిగ్రీలకు లోపు నమోదయ్యే అవకాశముందని చెప్పినట్లే. ఈ ఎండల తీవ్రత నుంచి కాస్తతం ఉపశమనం లభించినట్లే.
తర్వాత మాత్రం...
అయితే ఆ తర్వాత మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని కూడా పేర్కొంది. ఏప్రిల్ రెండో వారం ఆరంభం నుంచి ఇక భానుడు తన ప్రతాపాన్ని చూపుతాడు. ఎంత స్థాయి అనేది ఇప్పుడే చెప్పలేకపోయినా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కరీంనగర్ జిల్లాలోనూ అత్యధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముండటంతో ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.
Next Story